బీజేపీ పార్లమెంటరీ ఆఫీసు సెక్రటరీగా బాలు.

Hyderabad:

భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శిగా తెలుగు వ్యక్తి కామర్సు బాల సుబ్రమణ్యంను మరోసారి నియమించారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ కార్యవర్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. 2014లో కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పడిన తర్వాత కామర్సు బాల సుబ్రహ్మణ్యంను బిజెపి పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శిగా నియమించారు. 2007 నుంచి 2010 వరకు బాల సుబ్రమణ్యం బిజెపి జాతీయ మీడియా సహా కార్యదర్శిగా భాద్యతలు నిర్వహించారు. నితిన్ గడ్కరీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో లీగల్ సెల్ జాతీయ సహా కార్యదర్శిగా పని చేశారు.
కామర్సు బాల సుబ్రహ్మణ్యం రెండు దశాబ్దాలుగా పాత్రికేయుడిగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వివిధ స్థాయిలో పని చేశారు. 2007 నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ బిజెపికి సేవలు అందిస్తున్నారు.