బీబీనగర్‌లో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి.

బీబీనగర్:
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగుమెట్టు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.