బీసీలను విభజించి పాలించాలని చూస్తున్న కెసిఆర్.

  • బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ.

వరంగల్:
బీసీలను కులాల వారీగా విభజించి పాలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చూస్తున్నారని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ అన్నారు. ఈరోజు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న బీసీల సమస్యల పై ముఖ్యమంత్రి కి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ద్వార క వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ పాల్గొన్నారు. బీసీలను కులాల వారీగా విభజిస్తు పాలిస్తున్న రానున్న ఎన్నికలలో బీసీలందరు ఏకమై ఈ ప్రభుత్వాన్ని బొందపెట్టె సమయం దగ్గరపడింది అని హెచ్చరించారు.
వినతిపత్రంలో పొందుపర్చిన డిమాండ్స్ :
రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ ప్రకారం 1953లో కాక కలెల్కార్ కమిషన్, 1978లో బీసీ మాడల్ కమిషన్ ఓబీసీల విద్య, ఉపాధి, ఆర్ధిక, సామజిక స్థితిగతులను అధ్యయనం చేసిన రిపోర్ట్ ను బహిర్గతం చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క 2017- 18 రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్ 1,49,649 కోట్ల రూపాయిల బడ్జెట్లో 50% బీసీ లకు కేటాయించాలి.రాజ్యాంగ విరుద్ధమైన 12 % ముస్లిం రిజర్వేషన్లను వెంటనే రద్దు చేయాలి చేసినట్లు ప్రకటించాలి. ఓబీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్స్ ప్రకటించాలి.ప్రభుత్వం రాష్ట్రమంత 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు,కానీ చేయలేదు. దానిని వెంటనే ఏర్పాటు చేయాలి. కుల వృత్తులను ఆధారం చేసుకొని ఫెడరేషన్లను ఏర్పాటు చేయాలి. ప్రతి ఫెడరేషన్ కు 100 కోట్ల నిధులు కేటాయించాలి.గతంలో వున్న 17 ఫెడరేషన్లను తీరిగి పునరుద్ధరించాలి. బీసీ విద్యార్థులకు ఎటువంటి నిబంధన లేకుండ, మైనారిటీ విద్యార్థుల వలెనే 100% ఫీజు రీయంబర్సుమెంట్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేయాలి. ఈబీసీలలో అగ్రకులాలను చేర్చి,బీసీలకు అన్యాయం చేయవద్దు. కులాల వారీగా ప్రకటించిన నిధులను వెంటనే విడుదల చేయాలి. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శులు బొట్టు శ్రీనివాస్,బింగి శ్రీనివాస్, పుప్పాల రాజేందర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మాందాటి వినోద్ కుమార్, బాకం హరిశంకర్, ఎన్ఆర్ఐ సెల్ జిల్లా కన్వినర్ కందగట్ల సత్యనారాయణ,ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మేఘరాజ్ సుమన్ ఖత్రీ తదితరులు పాల్గొన్నారు.