బీహార్ లో బీజేపీ, జేడీయూ 50-50.

పాట్నా:

వచ్చే ఏడాది జరగబోయే లోక్ సభ ఎన్నికలకు బీహార్ లో బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు సరిసమానమైన స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకారం కుదుర్చుకున్నాయి. శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీహార్ సీఎం నితీష్ కుమార్ స్వయంగా మీడియాకు ఈ విషయం ప్రకటించారు. రెండు పార్టీలు సమాన స్థానాల్లో పోటీ చేయడంతో పాటు భాగస్వామ్య పక్షాలకు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో సీట్ల సంఖ్యను కూడా ప్రకటిస్తామన్నారు.బీహార్ లో 40 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ వేర్వేరుగా పోటీ చేశాయి. అప్పుడు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, లోక్ జనశక్తి పార్టీలతో పొత్తు పెట్టుకొని బీజేపీ అతిపెద్ద కూటమిగా బరిలోకి దిగింది. బీజేపీ 30 సీట్లలో మిగతా స్థానాల నుంచి ఇతరులు పోటీ చేశారు. అయితే ఈ సారి నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరడంతో ఆర్ఎల్ఎస్పీ, ఎల్జేపీ తమకు దక్కే స్థానాలపై సంశయం వ్యక్తం చేస్తున్నాయి.