బీహార్ సీఎం నితీష్ కుమార్ పై చెప్పు.

పాట్నా:
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కి చేదు అనుభవం ఎదురైంది. ఇవాళ రాజధాని పాట్నాలో జనతాదళ్ యునైటెడ్ యూత్ వింగ్ సమావేశంలో నితీష్ మాట్లాడుతుండగా ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఆ సమయంలో జనతాదళ్‌లో ఇటీవలే చేరిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ఉన్నారు. చెప్పు విసిరిన వ్యక్తి ఔరంగాబాద్‌కు చెందిన చందన్ కుమార్‌గా గుర్తించారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల వ్యవస్థ కారణంగా అగ్రకులానికి చెందిన తనకు ఉద్యోగం లభించడం లేదని ఆగ్రహించి చందన్ సీఎం నితీష్ పై చెప్పు విసిరాడు. అతడు నితీష్‌పైకి చెప్పు విసిరిన వెంటనే జేడీయూ యూత్ కార్యకర్తలు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. పోలీసులు వచ్చి చందన్‌ను విడిపించి అరెస్ట్ చేశారు. గతంలోనూ సీఎం నితీష్‌పై చెప్పు విసిరిన ఘటన జరిగింది.