బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం.  -ఉత్తంకుమార్ రెడ్డి.
హైదరాబాద్:

గిరిజనులు,ముస్లిమ్స్ రిజర్వేషన్ విషయంలో కేసీఆర్ కనీసం ఢిల్లీ పర్యటనలో మోడీని అడగలేదని టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 9th షెడ్యూల్ లో రిజర్వేషన్ అంశం పెట్టిస్తా అని ముస్లిమ్స్ కు చెప్పిన కేసీఆర్ ముస్లిమ్స్ ను మోసం చేసాడన్నారు.
ముస్లిమ్స్ రానున్న ఎన్నికలలో కేసీఆర్ కు బుద్ది చెప్పండని పిలుపునిచ్చారు. గిరిజనుల విషయంలో 12శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ప్రధానితో గిరిజనుల కోసం మాట్లాడలేదన్నారు.

మోడీ తో లాలూచీ పడి అన్ని విషయాలలో మోడీకి కేసీఆర్ మద్దతు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. అన్ని విషయాలపై కేసీఆర్ ప్రజలకు జవాబు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన విషయంలో కేసీఆర్ ఎందుకు మోడీని ప్రశ్నించడం లేదన్నారు. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ ని కలిశానని భూత్ లెవెల్లో కార్య కర్తలతో కపిసి పార్టీని పటిష్టం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుందని టిపిసిసి అధ్యక్షుడు చెప్పారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అన్ని వర్గాలను సమన్వయం చెస్తూ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. పీసీసీ కమిటీల విషయంలో రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రతి నియోజక వర్గంలో ఎవరు ఆశా వహులు ఉన్నారో పార్టీ నుండి ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సర్వే చేయిస్తున్నామని చెప్పారు. ఎవరికి ప్రజలలో బలం ఉందొ వారిని గుర్తించే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. పంచాయతీ ఎన్నికలలో బీసీ లకు ఏ విధంగా రిజర్వేషన్ కల్పిస్తున్నారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.