బ్రాహ్మణ కార్పోరేషన్ లో భగ్గుమన్న విభేధాలు


హైదరాబాద్;
తెలంగాణ బ్రాహ్మణపరిషత్ లో విబేధాలు భగ్గుమంటున్నాయని తెలిసింది. పరిషత్కు చైర్మన్ గా ఉన్న మాజీ ఐ.ఏ.ఎస్.అధికారి రమణాచారికి, వైస్ చైర్మన్ గా  ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి జ్వాలా నరసింహారావుల మధ్య ఆధిపత్య పోరు ఉధృతమైనట్టు సమాచారం. చైర్మన్,కు వైస్ చైర్మన్ మద్య తీవ్ర మన స్పర్ధలు నెలకున్నాయని బ్రాహ్మణ పరిషత్ వర్గాలు తెలిపాయి. వైస్ చైర్మన్ జ్వాల నరసింహ రావు సంస్థ చైర్మన్ రమణాచారిపై ఉన్నవీ,లేనివీ కల్పించి ముఖ్యమంత్రికిఫిర్యాదు చేస్తున్నారని ఆవర్గాలంటున్నాయి. ఇద్దరి మద్య విభేదాలతో  బ్రాహ్మణపరిషత్పధకాలు అమలుజరగడంలేదనితెలుస్తోంది.ప్రభుత్వం100 కోట్ల తో బహ్మణపరిషత్ కు గొపనపల్లిలోబహ్మణ సంక్షేమ భవన్ నిర్మాణం తలపెట్టింది. కానీ‘పరిషత్’ లోనెలకొన్నవిబేధాలు, ఆధిపత్యపోరు వల్ల ఈ భవన నిర్మాణ పనులు నత్తనడకనసాగుతున్నవి.దీనికంతటికీ కారణం బ్రాహ్మణపరిషత్చైర్మన్ పదవిపై సి.ఎం.చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ జ్వాలా నరసింహారావు కన్నేయడమేననితెలియవచ్చింది.జ్వాలా నరసింహారావు  చేస్తూన్న చౌకబారు రాజకీయాలపై తన   సన్నిహితుల వద్ద  చైర్మన్ రమణ చారిమొరపెట్టుకుంటున్నట్టుతెలుస్తోంది.లేనిపోని అపవాదులతో తన ఇమేజ్ ను జ్వాలా దేబ్బతీస్తున్నారన్నది రమణాచారిఆరోపణ.ఈ పరిణామాలతో రమణ చారి తీవ్ర మనస్తాపానికి గురైనట్టుతెలుస్తోంది.చీఫ్పబ్లిక్ రిలేషన్స్ అధికారి హోదాలో నిరంతరం సిఎం కేసీఆర్ కు అందుబాటులో ఉంటూ మిగతా  సభ్యులపై జ్వాలా నరసింహారావు ‘దొరతనం’ ప్రదర్శిస్తున్నారంటూ సిబ్బంది ఆరోపిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం లోని బ్రాహ్మణుల సంక్షేమంకోసం ముఖ్యమంత్రి కెసిఆర్ సదుద్దేశంతో ఏర్పాటు చేసిన సంస్థ అంతర్గత కలహాలు,ఆధిపత్యపోరు,విబేధాలతోఅభాసుపాలవుతున్నట్టువిమర్శలు వస్తున్నవి. పరిషత్ ద్వారా వివిధ పధకాల కింద దరఖాస్తు చేసుకున్న వారికి సహాయం లభించడం లేదని అంటున్నారు.వివిధవ్యాపారాలు,ఉన్నత, విదేశీ చదువుల కోసం పెట్టుకున్న దరఖాస్తులకు మోక్షం లభించడం లేదని తెలిసింది.బ్రాహ్మణ పరిషత్ కు పెద్దమొత్తంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టు ప్రచారం జరుగుతున్నా ఆచరణలో రుణాలు మంజూరుకావడం లేదని విమర్శలు వస్తున్నవి. ముఖ్యమంత్రి కెసిఆర్ బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నప్పటికీ లబ్దిదారులకు నిధులు చేరడం లేదని ఆరోపణలు వస్తున్నవి.అటుసి.ఎం.సి.పి.ఆర్.ఓ గా, ఇటు బ్రాహ్మణ పరిషత్ వైస్ చైర్మన్ గా ద్విపాత్రాభినయం చేస్తున్న జ్వాలా నరసింహారావును ముఖ్యమంత్రి కట్టడి చేయకపోతే ఈ సంస్థ మరింత అప్రతిష్ట పాలవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.