భారత్ రికార్డు విజయం

వెస్టిండీస్ తో రాజ్ కోట్ లో జరిగిన మొదటి టెస్టులో భారత్ రికార్డు విజయం సాధించింది. ఏకంగా ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది. ఇది భారత్ కు వెస్టిండీస్, మరే ఇతర జట్టుపైన అతి పెద్ద గెలుపు. మూడు రోజుల్లో ముగిసిన మ్యాచ్ లో టీమిండియా తరఫున స్పిన్నర్లు రాణించారు. ఏకపక్షంగా సాగిన టెస్టులో భారత జట్టు ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. బ్యాటింగ్ లో పరుగుల వరద పారించగా బౌలర్లు కరీబియన్లకు కోలుకొనే అవకాశం ఇవ్వలేదు. కుల్దీప్ యాదవ్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. మిగతా 2 వికెట్లు అశ్విన్ ఖాతాలో పడ్డాయి.