భారత వ్యోమగామి!

భారత వ్యోమగామి త్వరలోనే రోదసీలో ప్రయాణించనున్నారు. 2022లో రష్యా తన సూయజ్ అంతరిక్ష నౌకలో భారత వ్యోమగామిని స్వల్పకాలిక శిక్షణ కోసం అంతర్జాతీయ రోదసీ కేంద్రం (ఐఎస్ఎస్)కి తీసుకు వెళ్లనుంది. భారత సహచరులను ఐఎస్ఎస్ తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు రష్యా అంతరిక్ష వర్గానికి చెందిన వర్గాలు తెలిపాయి. త్వరలోనే దీనికి సంబంధించిన ఒప్పందాలు జరగవచ్చని చెప్పాయి. భారత్ సొంతంగా మానవసహిత రోదసీ మిషన్ పూర్తి చేయడానికి ముందో తర్వాతో 2022లో ఈ యాత్ర జరగవచ్చని తెలుస్తోంది. భూ కక్ష్యలో ఏర్పాటు చేసిన నివాసయోగ్యమైన కృత్రిమ ఉపగ్రహమే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్). స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఎర్రకోట నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో కూడా 2022 నాటికి భారత వ్యోమగామి దేశీయంగా తయారైన రోదసీనౌక లో ‘గగన్ యాన్‘ చేయనున్నట్టు ప్రకటించారు. అదే జరిగితే అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఆ ఘనత సాధించిన నాలుగో దేశం అవుతుంది.