భార్య కాపురానికి రానందుకు ఆత్మహత్య.

హైదరాబాద్:
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రావడంలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న యువకుని ఉదంతం ఇది. నెరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.బి కాలనీకి చెందిన నవీన్ 24 స.ల యువకుడు అదే కాలనీకి చెందిన ఒక యువతిని ప్రేమించి మార్చి నెలలో వివాహం చేసుకున్నాడు. కొన్నిరోజులు బాగానే గడిచిన వీరి మధ్య ఏమయిందో తెలియదు గాని గతకొన్ని రోజులుగా ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు. అయితే అనేకసార్లు కలిసుందాము వచ్చెయ్యమని నవీన్ భార్యతో చెప్పినా ఆమె వినకుండా తల్లిదండ్రుల ఇంటి వద్దనే ఉండడంతో ఎంత బతిమిలాడిన వినకపోవడంతో బుధవారం రాత్రి తల్లితో చెప్పి బాధపడి రూములోకి పోయి పడుకున్నాడు. ఉదయం తలుపు ఎంతకీ తెరవకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా ఉరి పెట్టుకుని మరణించిన కొడుకుని చూసి తల్లి తల్లడిల్లిపోయింది. వెంటనే విషయాన్ని నెరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన కొడుకు నవీన్ చావుకు తన కోడలు పరోక్షంగా కారణం అని తెలిపింది.