న్యూఢిల్లీ:
యశ్ పాల్అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు కూతుళ్లపై యాసిడ్ చల్లి..ఆపై తానూ ఆ యాసిడ్‌ను తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని కర్వాల్ నగర్లో చోటుచేసుకుంది.ఈ ఘటనలో యాశ్పాల్(40) అక్కడికక్కడే మృతిచెందగా.. అతని భార్య,కూతుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.అతని భార్యకు మధ్య గొడవ జరిగింది.ఈ గొడవ మరింత ముదరడంతో ఆగ్రహానికి గురైన యశ్పాల్ యాసిడ్ తెచ్చి భార్య, పిల్లలపై చల్లాడు.ఆ తరువాత తాను తాగాడు. ఈ ఘటనలో యశ్పాల్ అక్కడికక్కడే మృతిచెందగా, అతని భార్య, కూతుళ్లు తీవ్ర గాయాలతో పడిపోయారు.వీరి ఆర్తనాదాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకన్నారు.బాధితులను స్థానిక గురు తేజ్ బహదూర్ ఆస్పత్రికి తరలించగా..అప్పటికే యాశ్పాల్ మృతిచెందినట్లు వైద్యులు దృవీకరించారు. అతని భార్యకు 40 శాతం గాయాలయ్యాయని, కూతుళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. వీరికి ప్రాణాపాయం ఏమీ లేదన్నారు. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.