మంత్రి తలసాని పర్యటన.

వనపర్తి:
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామ చెరువులో మూడవ విడత చేప పిల్లలను మత్స్య, పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వదిలారు. ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోపాల్ పేట మండలం తడిపర్తి లో గొల్ల కూర్మలకు సబ్సిడీ గొర్రెల దాణా ను మంత్రి శ్రీనివాస్ యాదవ్, పాల్గొన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎస్. నీరంజన్ రెడ్డి
పంపిణీ చేశారు. హరితహరంలో భాగంగా తలసాని మొక్కలు నాటారు. గోపాల్ పేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మంచిన చాపలమార్కెట్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి పాల్గొన్నారు.