మంథని టీఆరెస్ అభ్యర్థి ‘పుట్ట’ కు బిగుస్తున్న ఉచ్చు .

హైదరాబాద్:

2013లో గుండా నాగరాజు ఆత్మహత్య కేసులో పుట్ట మధును నిందితుడిగా చేర్చకుండా పోలీసులు తప్పించారని కోర్టు లో మంగళవారం పిటిషన్ దాఖలయ్యింది.తదుపరి విచారణ 10 రోజులకు వాయిదా పడింది. 2013లో తన టికెట్ కోసం కేసీఆర్ సభలో నాగరాజును ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినట్లు పిటిషనర్ ఫిర్యాదు చేశారు.ఇందుకు సంబంధించి నాగరాజు కాల్ డేటా, నాగరాజుకు పుట్ట మధు రూ.50వేల ఇచ్చినట్లు సాక్ష్యాలతో కోర్టులో పిటిషన్ దాఖలైంది.మంథనికి చెందిన బిళ్లా రమణారెడ్డి తరపున ఉమ్మడి హైకోర్టు న్యాయవాది జి.వి.నాగమణి పిటిషన్ వేశారు.

2013 సంవత్సరం జున్ 6 వ తేదీన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మంథని లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో తనకు లబ్ధి చేకూరేవిధంగా ఏదో ఒక పెద్ద అలజడి, హల్చల్ సృష్టించాలని పుట్ట మధు నిర్ణయించిన క్రమంలో ఈ ఘటన జరిగిందని రమణారెడ్డి చెబుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త గుండా నాగరాజును అప్పటి వైసీపీ నాయకుడు పుట్ట మధు బలవంతంగా ప్రేరేపించినాడని ఆయన ఆరోపణ. మంథని టిఆర్ఎస్ టిక్కెట్ తనకు లభిస్తుందని కుట్రపూరితంగా పథకం పన్ని అందుకు గాను పుట్టా మధు 50000 రూపాయలు నాగరాజు ఇచ్చినట్టు రమణారెడ్డి ఆరోపించారు.పుట్ట మధు ప్రేరణతో “మోనొక్రొటోఫస్” పురుగు మందు కొన్నట్టు పిటిషనర్ తెలిపారు.మంథనిలో “మన గ్రోమోర్” పురుగుల మందు షాపుకు వెళ్లి అత్యంత విషపూరితమైన మోనొక్రొటఫస్ పురుగుల మందు కొన్నట్టుగా నాగరాజు తనకు చెప్పినట్టు బిల్లా రమణారెడ్డి తెలిిపారు. మంథని లో నరసింహ శివకిరణ్ గార్డెన్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరుగుతున్న స్థలానికి చేరుకుని తనతో తెచ్చుకున్న మోనోక్రొటొఫస్ పురుగుల మందు తాాగాడు.దీన్ని గమనించిన కార్యకర్తలు వెంటనే మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నాగరాజును కరీంనగర్ పట్టణంలో చలిమెడ ఆనందరావు ఆసుపత్రికి తరలించారు .వైద్యం చేస్తూ ఉండగా గుండా నాగరాజు మరణించారు. ఆ తరువాత నాగరాజు బంధువులు చేసిన ఫిర్యాదు మేరకు మంథని పోలీసులు Cr No 110/2013 U/s 174 IPC క్రింద కేసు నమోదు చేశారు. అప్పటి మంథని S I, ప్రస్తుత C I నటేష్ గౌడ్ విచారణ జరిపారు. ఈ కేసులో పుట్ట మధుకర్ ప్రధాన పాత్రధారి, సూత్రదారి అని ఆతని టెలిఫోన్ 📞 కాల్స్ డాట ఆధారంగా విచారణలో తేలడంతో వెంటనే 174 IPC క్రింద నమోదైన Cr No 110/2013 కేసును సెక్షన్ 306 IPC క్రింద మార్చడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మంథని JFCM కోర్టులో Section Of Alteration మెమో దాఖలు చేశారు. అట్టి దాఖలు చేసిన మెమో లో పుట్ట మధు పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. అనంతరం మంథని JFCM కోర్టు సెక్షన్ ఆఫ్ లా ఆల్టర్ చేస్తూ అనుమతి మంజూరు చేసింది. నిందితులలో ఒకరైన బిళ్లా రమణారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ను ఏ కారణల చేత వదిలివేశారో తెలియదు.పోలీసులు పుట్టా మధును ఈ కేసులో నుంచి తప్పించి బిళ్లా రమణారెడ్డి పైన చార్జీషీటును JFCM కోర్టు లో దాఖలు చేశారు.

మంథని JFCM కోర్టులో 5 సంవత్సరాలపాటు సుధీర్ఘంగా కొనసాగిన విచారణ ఎట్టకేలకు 2018 సంవత్సరం లో జిల్లా సెషన్స్ కోర్టుకు బదిలీ అయ్యింది. అక్కడ SC No 1/2018 గా మంథని అసిస్టెంట్ సెషన్స్ కోర్టుకు, తదుపరి విచారణ నిమిత్తం కేసు మంథని అసిస్టెంట్ సెషన్స్ కోర్టు కు బదిలీ అయ్యింది. బిళ్లా రమణారెడ్డి తెలంగాణ రాష్ట్ర DGP ని కలిసి వినతిపత్రం సమర్పించారు. అట్టి వినతిపత్రం లో పుట్ట మధు వల్ల తనకు ప్రాణహాని ఉందని ప్రస్తావించారు. సెక్షన్ 319 Cr Pc క్రింద పుట్ట మధుకర్ ను కేసులో నిందితుడు గా చేర్చాలని కోరుతూ క్రిమినల్ మిసిలియన్స్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన మంథని అసిస్టెంట్ సెషన్స్ కోర్టు విచారణను ఈ నెల 26 కి వాయిదా వేశారు.