మద్యం ప్రియులకు ‘ముందస్తు’ గుడ్ న్యూస్!!

6 ఫుల్ బాటిళ్లు, 12 బీర్ల కోటాకు అనుమతి.
హైదరాబాద్:
తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి ఉంది. దీంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. ఎన్నికల వేళ మందుబాబులు బాధపడే సందర్భాలుంటాయి. మందు అందుబాటులో ఉండదు అన్న ప్రచారం ఉంటుంది. కానీ తెలంగాణ ఆబ్కారీ శాఖ మద్యం ప్రియులకు తీపి కబురు అందించింది. ఎన్నికల వేళ మద్యం ప్రియులు ఎలా తాగాలి? ఎంత తాగాలన్న దానిపై క్లారిటీ ఇచ్చింది.ఎన్నికల కోడ్ లో భాగంగా మందు బాబులకు ఒక్కరికి 6 ఫుల్ బాటిల్ లు, 12 బీర్లు తీసుక పోయే వెసులుబాటు కల్పించారు. అంతలోపు మద్యాన్ని తరలిస్తే పోలీసులు కానీ, ఆబ్కారీ శాఖ వారు కానీ ఏమనరు. పోలీస్ శాఖ,ఆబ్కారీ శాఖ ఇ అనుమతి ఇస్తారు. కానీ అంతకంటే ఎక్కువ తీసుకపోతే సీజ్ చేస్తారు.ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తో చర్చించారు.22న కేంద్ర ఎన్నికల సంఘం తరపున ఒక బృందం వస్తున్నందున ‘ముందస్తు’ చర్యలపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించారు. తెలంగాణ బార్డర్ ల దగ్గర ఆరు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రాల అధికారులతో సమావేశాలు నిర్వహించి మధ్యం అక్రమరవాణ కాకుండా చూస్తున్నారు.
6 బార్డర్ మొబైల్ టీమ్ లు ఏర్పాటు చేశారు. ఆబ్కారీ శాఖ, పోలీస్ శాఖ తో సమన్వయం చేసుకొని పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఈ.సి. తెలిపింది. మన తెలంగాణలో ఎలాంటి సమస్య లేదు.