మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగాపదవీ విరమణ అనంతరం.

మద్రాసు హైకోర్టు హైకోర్టు న్యాయమూర్తిగాపదవీ విరమణ అనంతరం రైతు వేషంలో కనిపిస్తున్న జస్టిస్ ఎ.సెల్వం ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. టీ-షర్టు, షార్ట్ ధరించిన జస్టిస్ సెల్వం తలకు కండువా చుట్టుకుని ఎంతో అనుభవం కలిగిన రైతు వలే పొలం దు న్నుతూ కనిపించడం అందరినీ విస్మయుల్ని చేస్తోంది. 62 సంవత్సరాలు నిండడంతో పదవీవిరమణ చేసిన ఆయన శివగంగ జిల్లా తిరుపత్తూర్ తాలూకాలోని తన సొంతవూరు పులంకురిచిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన గురించి, ఆయన తీసుకున్న నిర్ణయం గురించి పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘పదవీ విరమణ అనంతరం ఏ న్యాయమూర్తయినా ప్రభుత్వం నియమించే కమిషన్ చైర్మన్‌గానో, ట్రిబ్యునల్ సభ్యుడిగానో నియామకం పొందాలని భావిస్తాడు. కానీ అందుకు విరుద్ధంగా వ్యవసాయదారునిగా శేషజీవితాన్ని ఎంచుకోవడం అభినందనీయ’మంటూ ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో తనపై వెల్లువెత్తుతున్న ప్రశంసల గురించి ఆయన వద్ద ప్రస్తావించగా చిరునవ్వు నవ్వారు.

‘వ్యవసాయం నా అసలు వృత్తే. నా గతవృత్తిలో మాదిరిగా పెద్దపెద్ద గౌన్ వేసుకోవాలని లే’దని ఆయన అన్నా రు. వ్యవసాయంపై తనకున్న మక్కువను రైతు కుటుం బానికి చెందిన ఆయన ఎంతో ఆసక్తితో చెబుతారు. ఆయన కుటుంబం వంశపారంపర్యంగా దాదాపు శతాబ్ద కాలం నుంచి వ్యవసాయాన్నే వృత్తిగా ఎంచుకుంది. అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో తనకు చదువు అబ్బడంతో తాము మదుైరెకి తరలివెళ్లామని ఆయన చెప్పారు. అక్కడే తాను న్యాయవాదాన్ని అభ్యసించానని ఆయన తెలిపారు. న్యాయవాదం పూర్తయిన తరువాత ఆయన మదుైరెలో ప్రాక్టీస్ ప్రారంభిం చారు. అనంతరం జస్టిస్ సంజయ్ కిషన్ సిఫార్సు వేురకు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడం కోసం 2015లో మద్రాసుకు మ కాం మార్చారు. 2018లో పదవీ విరమణ చేసిన ఆయన అనంతరం తన సొంతవూరిలో గల పూర్వార్జితైమెన ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆయన తన విధి నిర్వర్తిస్తుంటారు. పొలాన్ని ఆయనే దున్నుతారు. ట్రాక్టర్ నడపడం వంటి పనులు సహా వ్యవసాయ ప నులన్నీ ఆయనే చేస్తుంటారు.

‘ఇప్పుడు నేను విత్తనాలు చల్లాను. కూరగాయలు, వేరుశెనగ పండిస్తాను. అయితే, ఇక్కడ వరి ప్రధాన పంటగా ఉంది. నాకు చెం దిన పొలాన్ని ఇతరులకు కౌలుకి ఇవ్వడం నాకు సుతరాము ఇష్టం లేదు. అందుకే సొంతంగా వ్యవసాయం చేయడం ద్వారా వ్యవసాయంపై నాకున్న అభిరుచిని కూడా నెరవేర్చుకుంటున్నా’నని ఆయన అంటారు. ఇంతవరకు వ్యవసాయంలో తనకు అనుభవం లేకపోయి నా నేర్చుకుంటానన్నారు.

ఆయన న్యాయవాదిగా 1981లో జీవితాన్ని ప్రారంభించారు. తిరువన్నామైళె జిల్లా న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తిగా నియమితుైలె అనంతరం మద్రాసుైహెకోర్టులో శాశ్వత న్యాయమూర్తి గా బాధ్యతలు నిర్వర్తించారు. 31 సంవత్సరాల సర్వీసులో ఆయన కనీసం పది బహిరంగ న్యాయస్థానాల్లో తీర్పులు ఇవ్వడమే కాకుండా ఒక తీర్పును వాయిదా వేశారు. న్యాయవిభాగంలో తనకున్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ, తనకు తెలిసినంత వరకు మనదేశంలో న్యాయవిభాగం సమర్థవంతంగా లేదని, ఇందుకు తాను ఆ విభాగాన్ని తప్పుపట్టడం లేదని ఆయన చెప్పారు. కానీ, ఇది అవినీతి రాజకీయ నాయకులు పెరగడానికి కారణమవుతోందని ఆయన పేర్కొన్నారు. న్యాయవిభాగం స్వయంప్రతిపత్తి కలిగి వుండి, ప్రజలకు సేవచేసేలా ఉండాలని ఆయన అభిలషించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్, జస్టిస్ కె.టి.థామస్, జస్టిస్ పణిక్కర్ రాధాకృష్ణన్‌లంటే తనకెంతో అభిమానవుని ఆయన చెప్పారు.

ఒక సందర్భంలో జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ మరణానికి వారం ముందు కోచిలో తాను కలిశానని, ఆ స్మృతి ఇంకా తన మనసులో మెదులుతూనే ఉన్నదని ఆయన తెలిపారు. ఆ ముగ్గురు న్యాయమూర్తులతో తన కు సాన్నిహిత్యం లేకపోయినా వారిచ్చిన తీర్పులను పరిశీలిస్తుండేవాడినని ఆయన చెప్పారు. వారి అనుభవాలను తన జీవితానికి అన్వయించుకున్నానని అన్నారు. ఆ ము గ్గురి ఆశయాల ప్రోద్బలంతోనే తాను పదవీ విరమణ చేసిన వెంటనే కారు తాళాలను అప్పగించానని, తన సొంతకారులో ఇంటికి వచ్చేశానని ఆయన వివరించారు. తన జీవితంలో ఒక అ ద్యాయం ముగిసిందని, నా సొంతభూమిలో వ్యవసాయం చేయడం తనకెంతో మానసిక తృప్తి కలిగిస్తోందని పేర్కొన్నారు.

– మేఘా కావేరి, శ్రీరామ్.