మనీ లాండరింగ్,ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు చర్యలు.

-సుష్మా స్వరాజ్.
జోహేన్స్ బర్గ్:
అంతర్జాతీయ వాణిజ్యం,నిబంధనలపై ఆదారపడిన ప్రపంచ వ్యవస్థకు ఎదురయ్యే సవాళ్లను  బ్రిక్స్ దేశాలు సమైక్యంగా ఎదుర్కోవాలని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్ధిక సహాయాన్ని నిరోధించడం, తిరుగుబాటు అణిచివేతకు  బ్రిక్స్ దేశాల మధ్య సహకారం అవసరమన్నారు. దక్షిణాప్రికా లోని జోహెన్స్ బర్గ్ లో జరిగిన బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో సుష్మా స్వరాజ్ ప్రసంగించారు.అంతర్జాతీయ వాణిజ్యం, విదేశీ సంబంధాల్లో అవరోదాలు ఎదురవుతున్న సమయంలోనే బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచం అభివృద్ధి చెందుతున్నట్టు సూచనలు కనిపిస్తున్నా.. దీర్ఘకాలిక అభివృద్ధికి సమస్యలు ఎదురవుతున్నాయని సుష్మాస్వరాజ్ అన్నారు. ప్రపంచీకరణ లాభాలు అందరం పంచుకుంటున్నా ఇంకా సవాళ్లు అధిగమించవలసి ఉందన్నారు.  మనీ లాండరింగ్,  టెర్రరిస్ట్ ఫైనాన్స్,  సైబర్ స్పేస్,  డీ రాడికలైజేషన్, కౌంటర్ టెర్రరిజం కోసం బ్రిక్స్ దేశాలు ఏకం కావాలని ప్రధాని పిలుపునిచ్చినట్టు సుస్మా స్వరాజ్ చెప్పారు.