మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్.

హైదరాబాద్:

అసెంబ్లీ రద్దు చేసిన రోజునే 105 స్థానాలను ప్రకటించిన టీఆర్ఎస్.. తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ అభ్యర్థిగా మాణిక్ రావు, మలక్‌పేట్ అభ్యర్థిగా చావ సతీశ్ పేర్లను ప్రకటించింది. ఆ రెండు నియోజకవర్గాల్లో వీరిద్దరూ గతంలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే మళ్లీ వారిద్దరికే ఆయా స్థానాల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు. మరో పన్నెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కేసీఆర్‌తో సమావేశమైన హరీశ్ రావు ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించారు. నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితులు, అభ్యర్థుల ప్రచారంపై చర్చించినట్టు తెలుస్తోంది.