మరో వివాదంలో ‘పుట్ట’. సొంత పత్రికలో కేసీఆర్ పై వ్యతిరేక కథనాలు.

కరీంనగర్:

మంథని టీఆరెస్ అభ్యర్థి పుట్ట మధు మరో వివాదంలో చిక్కుకున్నారు.హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పైన ప్రభుత్వానికి కెసిఆర్ కి చిత్తశుద్ధి లేదంటూ పుట్ట మధు సొంత పత్రిక అయిన ‘త్రివేణి గళం’లో కథనం‬ ప్రచురించారు.కెసిఆర్ చిత్తశుద్ధిని అనుమానిస్తు ఈ వార్త కొనసాగింది.

నాలుగేళ్లు గడిచినా హుస్సేన్ సాగర్ ని పట్టించుకోలేదని, వందల కోట్లు ఖర్చు పెట్టినా చుక్క నీటిని శుద్ధి చేయలేదని విమర్శించారు.
పాలకులకు చిత్తశుద్ధి ఉంటే అధికారులు నిర్లక్ష్యంతో ఉండరని ఎత్తిపొడిచారు.