మరో 20 ఏళ్లు సీఎంగా కేసీఆర్.. – మంత్రి చందూలాల్

గోవిందరావుపేట:
మహాకవి దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే..సీఎం కేసీఆర్ నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అంటున్నారు..దేశం చూపు తెలంగాణ వైపు చూసేల చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది..తెలంగాణలో మరో 20 ఏళ్లు సీఎం కేసీఆర్ పాలిస్తారని రాష్ట్ర గిరిజనాభివృద్ధి , పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు అజ్మీరా చందూలాల్ అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు నియోజకవర్గం, గోవిందరావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి చందూలాల్  పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత గోవిందరావుపేట మండల కేంద్రంలో  1.10 కోటి పదిలక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత గోవిందరావుపేట మండలం సోమలగడ్డ గ్రామంలో 1 ఒక కోటి 38 లక్షలతో   ఎన్. హెచ్ 163 నుండి సోమలగడ్డ వరకు నిర్మించనున్న  బి.టి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అటు పిమ్మట గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో 16.85 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని కూడా మంత్రి చందూలాల్ ప్రారంభించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను నెంబర్ వన్ గా తీర్చిద్దుతున్నారు..అసలు దేశ చరిత్రలో రైతులకు రైతు బీమా కల్పించిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి చందూలాల్ కొనియాడారు. మహాకవి  దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే సీఎం కేసీఆర్ నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అంటూ భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని  అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రామప్ప , లక్నవరం చెరువుల్లో  356 రోజులు నీళ్లు ఉంటాయని మంత్రి చందూలాల్ స్పష్టం చేశారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.45 వేల  కోట్లతో  40 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి …. ఎక్కడ ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా అమలు చేయిస్తున్నారని, పార్టీలకతీతంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను వర్తింపచేస్తున్నారని మంత్రి చందూలాల్ ప్రశంసించారు. అలాగే  రైతుల కోసం పంట పెట్టుబడికి ఎకరానికి రూ. 4,000/-  రెండు పంటలకు కలిపి రూ. 8,000/- ఇస్తున్న సీఎం కేసీఆర్ గారికి రుణపడి ఉండాలని ఆయన పిలుపు ఇచ్చారు. యావత్  దేశం చూపు తెలంగాణ వైపు చేసేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని, తెలంగాణ రాష్ట్రంలో  మరో 20 సంవత్సరాలు  సీఎంగా కేసీఆర్ ఉంటారని మంత్రి చందూలాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ములుగు ఆర్డఓ రమాదేవి, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్, గోవిందరావుపేట మండల తహసీల్దార్, భూపాలపల్లి జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య ,  ఎంపీటీసీ , సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు