మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మృతి!!

2014 – 2018 మధ్య కాలంలో మల్కాజ్ గిరి నియోజకవర్గ శాసనసభ సభ్యుడిగా ఉన్న సి. కనకారెడ్డి శనివారం ఆకస్మికంగా మృతి చెందారు. కనకారెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. శాసనసభ సభ్యుడిగా కనకారెడ్డి చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. కనకారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.T