మల్లన్న సాగర్ కు హై కోర్ట్ పచ్చజెండా.

హైదరాబాద్:
మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులపై సింగల్ బెంచ్ స్టే ను హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం ఎత్తివేసింది.ప్రాజెక్టు పనులు కొనసాగించవచ్చునని హైకోర్ట్ తెలిపింది. ఈ ప్రాజెక్టు వల్ల ఉపాధి కొల్పుతున్నాం అంటూ గతంలో హై కోర్ట్ ను ఏటీగడ్డ కిష్టపూర్ గ్రామస్థులు ఆశ్రయించారు.సింగల్ బెంచ్ స్టే పై డివిజన్ బెంచ్ లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు వాదనలు వినిపించారు.