మళ్లీ ఇన్ స్టాగ్రామ్ షురూ.

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ఇంక్ కి చెందిన ఫోటో షేరింగ్ సోషల్ నెట్ వర్క్ యాప్ ఇన్ స్టాగ్రామ్ తిరిగి మామూలుగా పని చేస్తోంది. ఈ ఉదయం ఇన్ స్టాగ్రామ్ క్రాష్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ స్టా యూజర్లు ఆందోళన చెందారు. కొద్ది సమయం పాటు ఇన్ స్టాగ్రామ్ మొబైల్ యాప్, వెబ్ సైట్ పనిచేయడం ఆగిపోయాయి. దీంతో యాప్ లో ‘ఫీడ్ రిఫ్రెష్ కాద‘ని మెసేజ్ వచ్చింది. వెబ్ సైట్ లో యూజర్లు ఫీడ్ లోడ్ చేయలేకపోయారు.దీంతో యూజర్లంతా ట్విట్టర్ లో ఇన్ స్టాగ్రామ్ పై ఫిర్యాదు చేశారు. ఇన్ స్టా క్రాష్ పై జోకులు, కామెంట్లు వెల్లువెత్తాయి. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, భారత్, సింగపూర్, ఇతర దేశాల్లో ఇన్ స్టాగ్రామ్ లో సమస్యలు వచ్చినట్టు డౌన్ డిటెక్టర్ గుర్తించింది. దీనిపై వ్యాఖ్యానించకుండా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మౌనంగా వహించాయి.కొన్ని గంటల తర్వాత ఫోటో షేరింగ్ యాప్ తిరిగి యథాప్రకారం పని చేయడం ప్రారంభించింది. ఇప్పుడు యూజర్లు ఎప్పటి మాదిరిగానే తమ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్ యాప్ కి 100 కోట్ల మందికి పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. రోజురోజుకీ వీరి సంఖ్య పెరుగుతోంది.