మళ్ళీ ఆర్థిక మాంద్యం?

అమెరికా, చైనాల మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యానికి దారి తీసే అవకాశముందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. చైనాకు చెందిన సుమారు 20,000 కోట్ల డాలర్ల విలువైన వస్తువులపై సుంకాన్ని 10 శాతం నుంచి 25 శాతానికి అమెరికా పెంచింది. దీనికి ప్రతికారంగా చైనా ఎలాంటి సుంకాలు విధించరాదని, తమ విధానాలకు తలొగ్గాలని ట్రంప్‌ ఇవాళ ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌ చేసిన కొన్ని గంటలకు సుమారు 9000 కోట్ల డాలర్ల విలువైన అమెరికా వస్తువులపై సుంకాన్ని విధించనున్నట్లు చైనా ప్రకటించింది. ముఖ్యంగా అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయరాదని నిర్ణయించింది. ఇప్పిటికే సోయాబీన్‌ అమ్ముడుబోక… అమెరికా రైతులు రుణాలు కట్టలేక దివాళా తీస్తున్నారు. తాజాగా రెండు వేశాల మధ్య మొదలైన వాణిజ్య యుద్ధంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని ఇతర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి సరిపోదన్నట్లు మరో 30,000 కోట్ల విలువైన చైనా వస్తువులపై తాజాగా సుంకం విధించేందుకు అమెరికా సిద్ధమౌతోంది. చైనా నుంచి ప్రతిఘటన ఉండదని భావించిన అమెరికాకు ఇవాళ్టి చర్యతో కంగుతింది.

కుప్పలూతున్న మార్కెట్లు

వాణిజ్య యుద్ధం కారణంగా అనేక ప్రపంచ దేశాల మార్కెట్లు భారీగా దెబ్బతిన్నాయి. షేర్‌ మార్కెట్‌తో పాటు కమాడిటీ మార్కెట్లు కూడా కుంగిపోయాయి. కేవలం వారం రోజుల్లోనే దాదాపు 5 శాతం నుంచి 7 శాతం వరకు షేర్‌ మార్కెట్‌ క్షీణించింది. భారత్‌ వంటి మార్కెట్‌ కూడా ఈ వాణిజ్య యుద్ధ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయింది. సరిగ్గా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒకవైపు క్రూడ్‌ ధరలు పెరుగుదల, మార్కెట్‌ పతనంతో ఆర్థిక వ్యవస్థపై దిగులు పెరిగింది. ట్రంప్‌ ప్రకటనతో మొదలైన కమాడిటీ, షేర్‌ మార్కెట్ల పతనం ఇవాళ కూడా కొనసాగింది. భారత మార్కెట్లు కూడా ఒక శాతంపైగా క్షీణించగా… చైనా మార్కెట్లు ఒకటి నుంచి రెండు శాతం తగ్గాయి. మధ్యాహ్నం మొదలైన యూరో మార్కెట్ల పతనం భారీగా ఉందది. మరోవైపు అమెరికా ఫ్యూచర్స్‌ సూచీలు కూడా దాదాపు రెండు శాతం వరకు క్షీణించాయి. కార్పొరేట్‌ ఫలితాలుఉ అంతంత మాత్రంగా ఉన్నందున అమెరికా స్టాక్‌ మార్కెట్లు ప్రతి రోజూ క్షీణిస్తున్నాయి. ఇవాళ్టి భారీ పతనం చూస్తుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా వెంటనే ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళే అవకాశముంది. చైనా వస్తువులపై సుంకాలు పెంచిన తరవాత అమెరికాలో అక్కడి సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను పెంచాలని చూస్తోంది. ఇపుడు చైనా నిర్ణయంతో ఫెడరల్‌ రిజర్వ్‌ ఏం చేస్తుందన్న టెన్షన్‌ ప్రపంచ రిజర్వు బ్యాంకుల్లో ఏర్పడింది.