మసీదుల మరమ్మతులు.

సిద్ధిపేట:
రంజాన్ పండుగ సందర్భంగా మసీదుల మరమ్మత్తుల నిమిత్తం చెక్కులను అందజేసిన జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామా రెడ్డి.రంజాన్ పండుగ సందర్భంగా మసీదుల మరమ్మత్తుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు 10 లక్షలను కేటాయించగా జిల్లాలోని మసీదులకు ఒక్కో మసీదునకు 10 వేల చొప్పున జిల్లాలోని 109 మసీదులకు జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామా రెడ్డి మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సుతో కలిసి , మసీదు కమిటి సబ్యులతో సమావేశం ఏర్పాటు చేసి అట్టి చెక్కులను వారికి అందించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులకు నీటి వసతి ,నల్లాల బిగింపు, సున్నం , రంగులు వేయటం, ఇతర మరమత్తుల నిమిత్తం పండుగ వాతావరణంలో
పండుగలు జరుపుకొనే విధంగా అందరికోసం – అందరం అనే నినాదంతో ప్రభుత్వం కులమతాలకతీతంగా మతసామరస్యం వెల్లివిరిసే విధంగా అన్ని మతాలను గౌరవిస్తూ వారి వారి పండుగలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్నది అని దీనిని అందరూ వినియోగంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
మున్సిపల్ చైర్మెన్ రాజనర్సు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు , జిల్లా మంత్రి హరీష్ రావుల కృషి వల్ల వర్గాల ప్రజలకు మేలు కలిగే విధంగా కార్యక్రమాల రూపకల్పన చేస్తూ జిల్లాలో జరిగే రంజాన్,క్రిస్మస్,బతుకమ్మ,దసరా వంటి పండుగలకు కూడా ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ పండుగలను ఘనంగా జరుపుకోవటం జరుగుతుందని ఆయన అన్నారు.ముస్లిం మసీద్ కమిటి సబ్యులు గౌస్ మొహియోద్దిన్,జాఫ్ఫార్ ఖాన్ లు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం పండుగల సందర్బంగా ప్రత్యేక చొరవ చుపించి నిధులు విడుదల చేస్తూ
సహకారం అదిస్తున్నందుకు ముఖ్య మంత్రి చంద్రశేఖర రావుకు, మంత్రి టి.హరీష్ రావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పద్మాకర్ మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి జీవరత్నం వైస్ చైర్మెన్ అత్తర్ పటేల్ కౌన్సిలర్లు, ముస్లిం మత గురువులు హాజరయ్యారు .