మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జోరువాన

మహబూబ్ నగర్:
పాలమూరులో ప్రస్తుతం వింత వాతావరణం కనిపిస్తోంది. ఉదయం ఎండాకాలంలా ఎండలు దంచికొడుతున్నాయి. అతికొద్ది సమయంలోనే ఆకాశం మబ్బులు పట్టి.. భారీవర్షం పడుతోంది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావం కూడా ఈ వర్షాలకు ఒక కారణమని అధికారులు అంటున్నారు. బంగాళాకాతంలో ఆవర్తనం పశ్చిమ దిశగా కదిలి… తెలంగాణకు దగ్గరగా వస్తోందని… వర్షాలకు ప్రధానకారణం ఇదేనని వాతావరణ శాఖ అంటోంది.