మహాకూటమి ఒక ‘దుష్ట చతుష్టయం’. – ఎంపీ కవిత.

నిజామాబాద్:
మహాకూటమి ఒక దుష్ట చతుష్టయమని ఎంపీ కవిత అని అన్నారు. నిజామాబాద్ లో పోచమ్మ గల్లీ లో మట్టి గణపతి కి ఎంపీ కవిత పూజలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ దుర్యోధనుడు, దుశ్హాసనుడు, కర్ణుడు, శకుని ఈ పాత్రలు కూటమిలో ఎవరెవరు అనేది వారే తేల్చుకోవాలన్నారు. తెలంగాణ మీద ప్రేమ లేని పార్టీలు కూటమిగా వస్తున్నాయని విమర్శించారు. ప్రజలు ఆ కుట్రలను తిప్పి కొడతారన్నారు. అభిషేక్ సింగ్వీ 70 లక్షలు ఓట్ల గల్లంతు అన్నారని, ఉత్తమ్ 20 లక్షలు అంటున్నారని, ఇందులో ఏది సరైందో వారికే క్లారిటీ లేదని కవిత ఎద్దేవా చేశారు. ఓట్ల వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందన్నారు. అందులో కూడా కేసీఆర్ ఏమో చేశారంటే అర్థం ఉందా ? అని ప్రశ్నించారు.
అయినా కాంగ్రెస్ పార్టీకి కోర్టులకు వెళ్ళడం, చివాట్లు పడటం అలవాటేనని ఆమె చెప్పారు.
టీడీపీ, కాంగ్రెస్ పొత్తు అనైతికం అని విమర్శించారు. టీడీపీ కాంగ్రెస్ లు తెలంగాణ జనాలను పీడించాయన్నారు. అలాంటి పీడన పార్టీలతో తెలంగాణ జన సమితి కూడా జట్టు కట్టడం హాస్యాస్పదం అని ఎంపీ మండిపడ్డారు.