మహానాడు ఏర్పాట్లు.

విజయవాడ:

కానూరు సిద్దార్థ కాలేజీ ఆవరణలో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకటరావు.మహానాడు నిర్వహణకు 14 కమిటీలు వేశాం, పార్కింగ్,బోజన ఏర్పాట్లు, ఇతర వసతులను పరిశీలించిన కళా వెంకటరావు.మహనాడు ను ప్రతి కార్యకర్త, నాయకులు, అన్ని కమిటీలు బాధ్యతగా తీసుకోవాలన్నారు.ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సహా అన్ని విషయాలపై ఈ మహానాడులో సమగ్రంగా చర్చిస్తామన్నారు.
ఇంతకుముందు జరిగిన అన్ని మహనాడుల కంటే ఘనంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
ఈ మహానాడుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.మహానాడు ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇతర నేతలు పాల్గొన్నారు.