మహిళా జర్నలిస్టు దారుణ హత్య

పారిస్ : బల్గేరియాకు చెందిన ఓ మహిళా జర్నలిస్టు దారుణ హత్యకు గురైంది. దుండగులు ఆమెపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విక్టోరియా మారినోవా ఓ టీవీ ఛానల్‌లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.

బల్గేరియాలో పాపులర్ టీవీఎన్ ఛానల్‌లో ఆమె గత కొంతకాలంగా యురోపియన్ యూనియన్ నిధుల్లో అవకతవకలపై కథనాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విక్టోరియా శనివారం రూస్ పట్టణంలో హత్యకు గురయ్యారు. కాగా గత ఏడాది కాలంలో యూరప్ దేశాల్లో జర్నలిస్టులు హత్యకు గురి కావడం ఇది మూడో సంఘటన. అయితే ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.