మహిళ అదృశ్యం.

హైదరాబాద్:
శంషాబాద్ విమానాశ్రయం నుంచి క్యాబ్‌లో బయలుదేరిన ఓ మహిళ అదృశ్యం కావడం సంచలనానికి దారితీసింది. యార్లగడ్డ సాయిప్రసన్న(28) అనే వివాహిత శుక్రవారం ఉదయం జైపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఈమెను జైపూర్‌లో భర్త విమానం ఎక్కించాడు. కాగా… ఈమె రాక సమాచారం తెలుసుకున్న తండ్రి, తమ్ముడు విమానాశ్రయంలో ఎదురుచూస్తుండగా వారిని కలవకుండానే ఓ క్యాబ్ మాట్లాడుకుని వెళ్లిపోయింది. అనంతరం ఆమె తమ్ముడు ఆమెకు ఫోన్ చేయగా.. తాను క్యాబ్‌లో వెళుతున్నానంటూ చెప్పడంతో క్యాబ్ దిగాలని తమ్ముడు చెప్పాడు. అనంతరం కొద్దిసేపటికే సాయిప్రసన్న ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తండ్రి, తమ్ముడు ఆందోళనకు గురై వెంటనే ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా… ఆ మహిళ ఎటు వెళ్లిందనేది ప్రశ్నార్ధకం కాగా కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా మహిళ అదృశ్యంపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు