మాతా శిశు మరణాలు తగ్గించాలి. మంత్రి పరిటాల సునీత.

 

అనంతపురం:

ఆత్మకూరు మండల కేంద్రంలోనవనిర్మాణ దీక్ష లో మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు.నవ నిర్మాణ దీక్ష లో భాగంగా ఐదవరోజు జన్మభూమి – ఉపాధి కల్పన అనే అంశంపై చర్చ జరిగింది.నవ నిర్మాణ దీక్ష ప్రాంగణంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సందర్శించారు.ప్రభుత్వం మహిళలకు అందజేస్తున్న సంక్షేమ పధకాలపై ఆమె అవగాహన కలిగించారు. ప్రభుత్వం మహిళలు, చిన్నారులకు అందజేస్తున్న బాలామృతం, అన్న అమృత హస్తం పధకాలను సద్వినియోగం చేసుకోవాలని సునీత కోరారు. గర్భిణీ, బాలింతలకు ప్రభుత్వం అందజేస్తున్న పధకాలపై అవగాహన కల్పించాలని కోరారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు వైద్య శిబ్బంది కృషి చెయ్యాలని సూచించారు.విద్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించినట్టు ఆమె చెప్పారు. జ్ఞానదార కార్యక్రమం ద్వారా వెనుకబడిన విధ్యార్ధులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రైతుల విజ్ఞాపన మేరకు పట్టాదారు పాస్ పుస్తకంపై ఎనిమిది బస్తాల వేరుశనగ విత్తనాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ జన్మభూమి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.పది రోజుల పాటు జన్మభూమి కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించినట్టు చెప్పారు. జన్మభూమి కార్యక్రమం పై 78 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. కియా పరిశ్రమ ఏర్పాటు తో అనంతపురం యువతకు ఉపాధి అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్ధ ద్వారా 2020 నాటీకి 14 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించే దిశగ చర్యలు చేపడుతున్నామని వివరించారు.రాష్ట్రంలో 3.25 లక్షల మందికి కొత్తగా పించన్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు.60 సం.లు దాటిన ప్రతి ఒక్కరికీ పించన్లు అందిస్తామన్నారు. మహిళా సంఘంలో ఉన్న ప్రతి మహిళకు పది వేలు ఇచ్చి రుణ విముక్తి చేశామని సునీత తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చంద్రన్న పెళ్లి కానుక ఆడపిల్లల తల్లిదండ్రులకు వరంగా మారిందన్నారు.ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆదరణ పధకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ పనిముట్లు అందజేస్తున్నామని చెప్పారు. ఆదరణ పధకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి చెల్లించామని తెలిపారు.దేశవ్యాప్తంగా 10 లక్షల ఫారంపాండ్లు మంజూరైతే ఒక్క మన రాష్ట్రంలోనే 6 లక్షలు తవ్వించామని తెలిపారు.జిల్లాలోనే రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కువగా సి.సి రోడ్లు నిర్మాణం చేపట్టామన్నారు.ఆత్మకూరులో రూ.6.96 కోట్లతో త్వరలో తారురోడ్డు నిర్మాణం చేపట్టనున్నామని,ఆత్మకూరులో 11 సి.సి రోడ్లు నిర్మించడానికి నిధులు మంజూరు చేశామని మంత్రి వివరించారు.