మాదిగలకు 12, మాలలకు 7 అసెంబ్లీ సీట్లు!!

హైదరాబాద్:

కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం కల్పించేలా హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలకు రెండు అసెంబ్లీ సీట్లు చొప్పున మొత్తం బీసీలకు 34 సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే మాదిగలకు 12 సీట్లు.. మాలలకు 7 సీట్లు, లంబాడీలు 6, ఆదివాసీలకు 6 సీట్లు కేటాయించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ హైకమాండ్ పీసీసీకి సమాచారం ఇచ్చినట్లు తెలియవచ్చింది.