‘మాదిగ జాతి అంతానికి కేసీఆర్ కుట్ర’. – మంద కృష్ణ మాదిగ.

మంచిర్యాల:
జైపూర్ మండలం ఇందరాం గ్రామం లో బుధవారం ఉద్రిక్తపరిస్థితి నెలకొంది తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అభిమాని రేగుంట గట్టయ్య అంత్యక్రియలు ఎంపీ బాల్క సుమన్, నల్లాల ఓదెలు వచ్చి ప్రభుత్వం తరుపున ఆదుకుంటాం అన్ని చెప్పే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని కుటుంబసభ్యులు స్పష్టం చేయడం తో గ్రామం లో డిసిపి వేణుగోపాల్ రావు. ఏ సిపి సీతారాములుఅద్వర్యం లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండ‌లం ఇందారం లో రేగుంట గ‌ట్ట‌య్య అంత్య‌క్రియ‌ల సంద‌ర్భంగా పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.. ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఇందారంలో భారీగా పోలీసుల్ని మోహ‌రించ‌డంతో ఇందారంలో ఎప్పుడేం జ‌రుగుతుందోనన్న‌టెన్ష‌న్ వాతావ‌ర‌ణం కొన‌సాగుతోంది. సుమ‌న్ ప్ర‌చారం కార్య‌క్ర‌మంలో ఈ నెల 12న ఓదెలుకు టికెట్ కు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన గ‌ట్ట‌య్య పూర్తిగా కాలిన గాయాల‌తో హైద‌రాబాద్ లో చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం మృతి చెందాడు.గ‌ట్ట‌య్య మృత‌దేహాన్ని అత‌ని కుటుంబ స‌భ్యులు స్వ‌గ్రామం ఇందారం కు తీసుక‌వ‌చ్చారు. గ‌ట్ట‌య్య ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన న‌ల్లాల ఓదేలు, బాల్క సుమ‌న్ లు వ‌స్తే కానీ అంత్య‌క్రియ‌లు జ‌రిపేది లేదంటూ గ‌ట్ట‌య్య సోద‌రుడు తిరుప‌తి డిమాండ్ చేశారు.. గ‌ట్ట‌య్య మృత‌దేహాన్ని చూసి స్థానికులు , బంధువులు బోరున విల‌పించారు.గ‌ట్ట‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వ‌స్తున్న మంద‌కృష్ణ మాదిగ‌ను పోలీసులు అరెస్ట్ చేస్తార‌నే వార్త‌లు రావ‌డంతో ఇందారంలో అనుక్ష‌ణం ఉత్కంఠ‌త నెల‌కొంది. గ‌ట్ట‌య్య ఇంటికి వెల్లి వారి కుటుంబ స‌భ్యుల్ని మంద‌కృష్ణ ఓదార్చి స‌ర్కార్ పై తీవ్రంగా మండిప‌డ్డారు.

మాదిగ జాతిని అంతం చేసే కుట్రలు టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్నయి. కేసీఆర్ నిరంకుశంగా మాదిగా జాతిని అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నాడని.. టీఆర్ఎస్ పాలనలో అక్రమాలు అవినీతి చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించి నీతిగా న్యాయం గా కొనసాగిన మాదిగ బిడ్డ నల్లాల ఓదేలుకు టికెట్ నిరాకరించాడాన్ని మంద‌కృష్ణ త‌ప్పుప‌ట్టారు.. కేసీఆర్ చేసిన సర్వేలో 78% శాతంతో నల్లాల ఓదేలు ముందున్నాడన్న కేసీఆర్ టికెట్ నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుని.. నల్లాల ఓదేలుకు రెండవ సారి అన్యాయం చేశాడు. ఇందారంలోఆత్మహత్య‌చేసుకున్న రేగుంట గట్టయ్యకు ఎలాంటి న్యాయం చేయకుండా మరోసారి మాదిగ లకు అన్యాయం చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. శవరాజకీయాలకు పెట్టింది పేరు టీఆర్ఎస్ కేసీఆర్ అని.. మాదిగలు గర్జిస్తున్నార‌ని.. కేసీఆర్ అంతమే మాదిగల పంథం అని మంద‌కృష్ణ ప్ర‌క‌టించారు.. నల్లాల ఓదేలు ఏ అన్యాయం చేసిండని టికెట్ నిరాకరించారో టీఆర్ఎస్ స‌మాధానం చెప్పాల‌ని.. దళిత ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల పై కుట్ర పన్నార‌ని.. కేసీఆర్ ప్రభుత్వం లో అన్యాయానికి గురైందిమాదిగలే అని మంత్రి వర్గంలో అన్యాయం సైతం మాదిగలకే జరిగిందని,మాజీ డిప్యూటీ సీఎంను రాజ‌య్య‌ను త‌ప్పించార‌ని గుర్తు చేశారు. మాల మాదిగల మద్య ఘర్షణ సృష్డించాడానికే మాదిగల మద్య చిచ్చుపెట్టి కేసీఆర్ తొత్తులుగా మార్చుకున్నర‌ని చెన్నూర్ లోను మాల అభ్యర్థికి టికెట్ ఇచ్చి మాదిగ జాతి బిడ్డలను మనోవేదనకు గురి చేశార‌ని.. దీంతోనే రేగుంట గట్టయ్య ఆత్మహత్య యత్నం చేసుకున్న‌రాని.. ఈ ఘటనలో కాలి కూలింది మాదిగ బిడ్డే అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దొర అంహకారానికి ఈ ఎన్నికల నుండే గుణపాఠం చెప్పి మాదిగల సత్తా ఏంటో చూపిస్తా మ‌ని స‌వాల్ విసిరారు..
మాదిగ మహిళ నాయకురాలు బోడిగ శోభను సిట్టింగ్ కు నిరాకరించి అణగదొక్కి టికెట్ ఇవ్వకుండా అక్కడ కూడా మాలకే టికెట్ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నార‌ని.. మదిర , ఆందోల్ , చొప్పదండి , చెన్నూర్ ఎక్కడైనా మాదిగలనే అణచి వేసే దోరణే కనిపిస్తోందని.. టీఆర్ఎస్ పార్టీకి మాదిగ జాతి బుద్దిచెపుతుంద‌న్నారు.బాల్క సుమ‌న్, న‌ల్లాల ఓదేలు అంత్య‌క్రియ‌ల‌కు రావాల‌ని డిమాండ్ చేస్తూ గ‌ట్ట‌య్య సోద‌రుడు శ్రీ‌కాంత్, గ‌ట్ట‌య్య పిల్ల‌లు సాయినివేదిత‌, సాయి విజ్ఞేష్ ల‌తో క‌లిసి రూంలోకి వెళ్లి కిరోసిన్ పోసుకుని ఆత్మ‌హ‌త్య‌య‌త్నం చేయ‌గా పోలీసులు త‌లుపులు ప‌గుల‌గొట్టి వారిని బైట‌కు తీసుక‌వ‌చ్చారు.