మార్క్సిస్టు తమ్మినేనిపై మల్లన్న ‘తీన్మార్’.

హైదరాబాద్:

సిపిఎం పార్టీ ప్రజల వద్ద నుంచి వసూల్ చేసిన 100 కోట్లలో 10TV ని పెట్టి, మిగతా సొమ్మును రియల్ ఎస్టేట్ దంధాకు మరలించినట్టు తీన్మార్ మల్లన్న ఆరోపించారు. రామోజీరావుకు బంధువు అయిన సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 10TV చానెల్ ను కేసీఆర్ బెనామీ బంధువులకు అమ్మేశినట్టు మల్లన్న తెలిపారు. ఇప్పుడు 10TV కూడా కేసీఆర్ కుటుంబ చానల్ గా మారిందన్నారు. తనను తొలగించడం ప్రజా స్వామ్యానికే గొడ్డలిపెట్టు అని అన్నారు. సిపిఎం తెలంగాణ శాఖను కేసిఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్లు తీన్మార్ మల్లన్న ఆరోపించారు.