మాల్యా ను ఉంచబోయే ఆర్థర్ జైలు వీడియోలు చూపాలి. భారత్ ను కోరిన లండన్ కోర్టు.

లండన్:
తనను భారత్ కు అప్పజెప్పడాన్ని సవాల్ చేస్తూ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. తన కొడుకు సిద్ధార్థతో కలిసి మాల్యా కోర్టుకొచ్చాడు. విచారణ సందర్భంగా మాల్యా తరఫు న్యాయవాది జైలులోని పరిస్థితులపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో కోర్టు భారత్ కి మాల్యాను అప్పజెబితే అతనిని ఉంచే ముంబైలోని ఆర్థర్ జైలు, అందులో అతనిని ఉంచబోయే గది, ఇతర పరిసరాల వీడియోలు తమకు చూపించాలని కోర్టు భారత ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు భారత ప్రతినిధి బృందాలు తమ అంగీకారం తెలియజేశాయి.