మావోయిస్టు దంపతుల లొంగుబాటు

హైదరాబాద్;

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక అగ్రనేతలు ఇద్దరు మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పురుషోత్తం ఆయన భార్య వినోదిని ఇవాళ ఉదయం హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ ఎదుట సరెండర్ అయ్యారు. మావోయిస్టు పార్టీ ప్రచార కమిటీ సెక్రటరీగా ఉన్న పురుషోత్తంకు పార్టీలో మాస్టర్ బ్రెయిన్‌గా పేరుంది. మావోయిస్టు అగ్రనేతలు గణపతి, ఆర్కే, కిషన్‌తో కలిసి ఆయన సుమారు పాతికేళ్లుగా కలిసి పనిచేశారు. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ…మావోయిస్టు అగ్రనేతలు ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారని ఆరోపించారు. కింద స్థాయి కేడర్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రధానంగా ప్రజల సమస్యల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. అలాగే అనారోగ్య కారణాలతో లొంగిపోయినట్లు వారు పేర్కొన్నారు. కాగా పురుషోత్తం దంపతులపై పలు కేసులు ఉన్నాయి.