మిడ్ మానేరు కింద 76 వేల ఎకరాలకు నీరందిస్తాం. – మంత్రి హరీశ్ రావు.

హైదరాబాద్:
మిడ్ మానేరు ద్వారా ఈ యేడాది 76 వేల ఎకరాలకు సాగు నీటిని అందించాలని మంత్రి ఆదేశించారు. గత యేడాది 5 టి ఎం సి లను నింపామని, ఈ ఏడాది 25 టి ఎంసి లను నిల్వ చేయాలని కోరారు. మిడ్ మానేరు ప్రాజెక్టు కు చెందిన ప్యాకేజీల వారీగా పనులు మంత్రి హరీష్ రావు గురువారం సమీక్షించారు. లింక్ కెనాల్ లో అక్విడక్ట్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేసించారులింక్ కెనాల్ పనులను వేగంగా పూర్తి చేయాలని గుత్తేదారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. వంద మంది లేబర్ ను పెట్టి పనులు వేగంగా చేయాలని ఆదేశించారు. మిడ్ మానేరు ద్వారా ఎన్ని చెరువులు నింపవచ్చో ఆ వివరాలు పంపాలని ఆయన కోరారు. చుక్క నీరు వ్యర్థం కాకుండా చెరువుల ద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. మిడ్ మానేరు పునరావాస చర్యల కోసం 33 కోట్లకు ఆధరైజేషన్ పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అప్పటికప్పుడు ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి ఆధరైజేషన్ ప్రక్రియను మంత్రి హరీష్ రావు పూర్తి చేయించారు.
ఆర్ అండ్ ఆర్ కాలనీ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి హరీష్ రావు.
ఆర్ అండ్ ఆర్ కాలనీలో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశం. ఆర్ అండ్ ఆర్ కాలనీలు సందర్షించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ , జేసీలను ఆదేశించిన మంత్రి హరీష్ రావు.