మిషన్ భగీరథ లో ఉమ్మడి మెదక్ టాప్.

సంగారెడ్డి:
ఉమ్మడి మెదక్ జిల్లా మిషన్ భగీరథ అమలులో ప్రథమ స్థానం సాధించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 2389 గ్రామాలు ఉండగా 2107 గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు బుధవారం తెలిపారు. జూన్ 25 నాటికి అన్ని గ్రామాలకు తాగు నీరు చేరుస్తామన్నారు. వచ్చే 2నెలల్లో అంతర్గత పనులు పూర్తి ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ కోసం పనుల కోసం సంగారెడ్డి జిల్లాలో 1853 కోట్లు ఖర్చు చేసామని తెలిపారు.
మిషన్ భగీరథ పనుల కోసం మెదక్ జిల్లాలో 965 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.
నీటి పంపిణీ కోసం పంపింగ్ కేంద్రాలకు రెండో విద్యుత్ లైన్ వేయాలని అధికారులను హరీశ్ రావు ఆదేశించారు.గ్రామాల్లో అంతర్గత పైపు లైను పనులు పూర్తి కాగానే ద్వసం అయిన రోడ్లు మరమ్మత్తు చేయాలని ఆదేశించారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో నీళ్లు లేక నులక మంచం మీద స్నానం చేసే పరిస్థితి ఉండదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మంచి నీటి సమస్య గురించి అడగని అసెంబ్లీ సమావేశాలు లేవు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.70ఏళ్లలో కానీ పని కేసీఆర్ 4ఏళ్లలో చేశారన్నారు. పార్టీలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గతంలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో జిల్లా ఇంచార్జ్ మంత్రికి కేటాయించే వారు. కానీ TRS ప్రభుత్వం పార్టీలతో సంబందం లేకుండా ఎమ్మెల్యేలకు పూర్తిగా కేటాయిస్తోందని మంత్రి వివరించారు.