‘ముందస్తు’ఎన్నికలకు ఎన్నికల సంఘం రెడీ! తెలంగాణ ఏర్పాట్లపై సి.ఈ.సి. సంతృప్తి.

ప్రకాశ్, న్యూఢిల్లీ:

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిపేందుకు సీఈసీ సమాయత్తం అవుతోంది. నాలుగు రాష్ట్రాలతో పాటు కలిపి లేదంటే వేరుగా తెలంగాణ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ చేసేందుకు సిద్ధమవుతున్నది.తెలంగాణలోని రాజకీయ పార్టీలు లేవనెత్తిన అంశాలను ఉమేష్ సిన్హా కమిటీ తోసిపుచ్చింది.తెలంగాణలో పర్యటించిన ఉమేష్ సిన్హా కమిటీ ఎన్నికలకు అనుకూల వాతావరణం ఉందని ఒక నివేదికను సీఈసీకి అందజేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి శుక్రవారం సాధారణంగా ఎన్నికల ప్రక్రియపై జరిగే సమావేశం గంటన్నర పాటు జరిగింది. ఉమేష్ సిన్హా తెలంగాణలో పర్యటించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన రిపోర్ట్ పై సమీక్షించారు.

తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లపై ఉమేష్ సిన్హా కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లేక తెలంగాణకు ప్రత్యేకంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలనే అంశంపై సమాలోచనలు చేసిన సీఈసీ.అక్టోబర్ రెండో వారంలో నాలుగు రాష్ట్రాలతో పాటు లేదంటే తెలంగాణకు వేరుగా ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉన్నది.