‘ముంపు’ మండలాలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు : హైకోర్టు ఆదేశం.

హైదరాబాద్:

పోలవరం ముంపు 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు.ఈ మండలాలను కలపడం వలన తెలంగాణ భూభాగంతో పాటు ఓటర్లు కూడా నష్ట పోతారని పిటీషనర్ కోరారు.
7 ముంపు మండలాలలో డీ లిమిటేషన్ చేయకుండా ఎన్నికల కు ఎలా వెళ్తారని పిటీషనర్ ప్రశ్నించారు.రాజ్యాంగంలో ఆర్టికల్ 170 కి విరుద్దంగా ప్రవరిస్తున్నారని పిటీషనర్ అన్నారు.

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడం రాజ్యాంగ విరుద్దామని పిటీషనర్ వాదన.
పిటీషన్ ను విచారణకు హైకోర్టు స్వీకరించింది.దీనిపై అఫిడవిట్ కౌంటర్ దాఖలు చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కు హైకోర్టు ఆదేశించింది.తదుపరి విచారణను వచ్చే నెల 10 కి వాయిదా వేసిన హైకోర్టు.