ముఖ్యమంత్రికో ఘాటైన లేఖ.

KCR

అయ్యా! ముఖ్యమంత్రి గారూ!
ఏంటయ్యా..! ఆ మాటలు…
మేము సమ్మెకు దిగితే ఆర్టీసీని
మూసివేస్తరా? మేము మీకు
ఏం పాపం చేశామని ఆర్టీసీని
మూసివేస్తరూ?

తెలంగాణ ఉద్యమంలో మీతో
మేమందరం స్వరాష్ట్రం కోసం స్ట్రైక్ చేసినందుకా? లేక మా
ఉద్యోగాలను నెల రోజుల
పాటు ప్రాణాలను పణంగా
పెట్టి ఉద్యమం చేసినందుకా?
పోలీసోళ్ళతోటి లాఠీ దెబ్బలు
తిని కేసుల పాలు ఐనందుకా?
ఆర్టీసీని భూస్తాపితం చేస్తానని
మమ్మల్ని భయబ్రాంతులకు
గురిచేస్తున్నారు.

అసలు తెలంగాణ ఉద్యమం
మా ఆర్టీసీలతోటే సంపూర్ణం
అయ్యింది తప్ప,మీ తోటి
కాదు.అన్నేసి చూడు..నన్నేసి
చూడు అందట ఉప్పు కూరతో.
కూరను ఎంత అద్భుతంగా
వండినా… అందులో ఉప్ఫు
వేయకపోతే..ఆ కూర
బూడిదలో పోసిన పన్నీరు
లాంటిది.ఉద్యమ సమయంలో
ఎన్ని సంఘాలు బందు పిలుపు
ఇచ్చినప్పటికీ..ఈ రోజు బస్సు
లు నడుస్తున్నయా? అనేవారు
ఎవరైనా..! అంటే.. దానర్ధం
ఏంటో తెలుసా..? ప్రజలల్లో
మాకున్నటుమవంటి ఇమేజ్
అటువంటిది.”బందు” అనే
దానికి బాండ్ అంబాసిడర్
లాంటి వాళ్ళం.బందుకు IAS
ముద్రలాంటి వాళ్ళం.ఎండనక,వాననక,తక్కువ జీతాలతో
ఉద్యోగాలు ఏళ్ళ తరపడి చేసుకుంటూ…వస్తున్నాం…నిస్వార్ధంగా సేవ చేస్తున్నాం.

అందుకే మాతో పాటు,ఆర్టీసీ
కూడా “గాన్నిస్ బుక్”లోకి
ఎక్కింది.అటువంటి ఆర్టీసీని
మొన్న కాక మొన్న వచ్చి,
ఆర్టీసీని మూసేస్తా..కార్మికులను
ఉద్యోగుల నుండి తొలగిస్తా..
అని అంటవా? ఎంత ధైర్యం
నీకు..?
యూనియన్ నాయకులు
మొత్తం ఆర్టీసీని ముంచే
ప్రయత్నం చేస్తున్నారు.
నాయకుల మాట విని
కార్మికులు మోసపోవద్దు.
సమ్మెకు పోయి కార్మికుల
గొంతు కోసే దానికంటే సంస్ధను
ఎలా బలోపేతం చేసుకోవాలో
సంఘాల నాయకులు
ఆలోచించుకోవాలి.ఎన్నికల్లో
గెలవాలనే ఒకే ఒక కారణంతో
స్వార్ధపూరితమైన ఆలోచనల్తో
అటు ప్రభుత్వాన్ని,ఇటు
కార్మికుల కుటుంబాలను
ఇబ్బందికి గురిచేసే ప్రయత్నం
మానుకోవాలంటూ…
గురువారం ఆర్టీసీ కార్మిక
సంఘాలు ఇచ్చిన సమ్మె
నోటీస్ పై ప్రగతి భవన్ లో
సమీక్ష నిర్వహించి మా..
53 వేల గుండెలను ఆగేటట్టు
చేస్తరా? ఇంకా…
మా నాయకులకు స్వార్ధం
ఉంది.. అంటరా…!

మరీ….

తెలంగాణ విషయంలో
మీకున్నదాన్ని ఏమంటరూ..!
స్వార్ధం కాదంటరా…!
దళితున్ని ముఖ్యమంత్రి
చేస్తానని చెప్పి దళితున్ని ముఖ్యమంత్రిని
చేశావా? చెయ్యలేదు.
ఎందుకు చెయ్యలేదు?
అసలు తెలంగాణ మా కోసం
సాధించావా?లేక నువ్వు
ముఖ్యమంత్రి కావడానికి
సాధించావా?
నీ స్వార్ధం కోసం తెలంగాణలో
సుమారు 12 వందల మందిని
చంపావు.నువ్వు అధికారంలోకి
వచ్చిన తర్వాత ఆ 12 వందల
మందిలో ఎంత మందిని
ఆదుకున్నవ్ ?ఆ తల్లిదండ్రుల
కడుపుకోతతో ఈ రోజు CM
సీట్లో కూర్చోని,మాపై ప్రతాపం
చూపిస్తవా?
గెలిచిన తర్వాత ఒక మాట
గెలవక ముందుకు ఒక మాటా!

ముఖ్యమంత్రి కాక ముందు
ఆర్టీసీనీ ప్రభుత్వంలో కలుపుత
ప్రభుత్వ జీతాలిస్తానని ఎలా
మా ఆర్టీసీ కార్మికులకు హామీ
ఇచ్చారూ? అప్పుడు నీకు ప్రక్క
రాష్ట్రాలైన తమిళనాడు,
మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాల
ఆర్టీసీ గుర్తుకు రాలేదా? నీకు
ఉద్యమ సమయంలో మాతో
సుమారు 30 రోజులు సమ్మె
చేసుకున్నప్పుడు ఆర్టీసీ
మునుగుతది అని తెలియదా?
యూనియన్ల డిమాండ్లను
అంగీకరిస్తే ఏటా రూ.1400
కోట్ల అదనపు భారం
పడుతుంది.ఇప్పటికే రూ.3వేల
కోట్ల అప్పులు,దానికి రూ.250
కోట్ల వడ్డీల భారంతో పాటు
రూ.700 కోట్లు ఆర్టీసీకి నష్టాలు
వస్తున్నాయి.అందుకే ఆర్టీసీని
మూసేస్తా అంటున్నవ్ కదా..!
మరి నీ ప్రభుత్వం ఇప్పుడు
ఎన్ని లక్షల కోట్ల అప్పులల్లో
ఉంది.? సుమారు 2 లక్షల
కోట్ల అప్పుల్లో ఉంది.
అంటే…నీ ప్రభుత్వాన్ని కూడా
మూసేస్తవా? అలా ఐతే తక్షణమే స్వచ్చదంగా రాజీనామా చెయ్. సి.యం. సీటు వదిలిపెట్టు. ఆర్టీసీ చరిత్రలోనే
ఇంత వరకు 44% శాతం
ఎవరివ్వలేదు.రూ.5 కూడా
జీతాలు పెంచేది లేదు.
అంటున్నవ్ కదా! నువ్వు
పెంచేదేముందు అందులో
4 సంవత్సరాలకొక సారి
ఏ గవర్నమెంట్ ఐనా మా
మా ఆర్టీసీ కార్మికుల జీతాలు
పెంచవలసిందే.అది ఎవర్ని
అడిగినా న్యాయమైన డిమాండే అంటారు.5 సంవత్సరాల కోసం ఎలక్షన్లు
ఎలా జరుగుతయో మా
ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా
అలానే పెంచాలి.నువ్వు
ప్రస్తుతం ప్రధానమంత్రి
నరేంద్రమోడి కన్నా రెట్టింపు జీతం తీసుకుంటున్నావు.
అంతా నీ ఇష్టమేనా!
నువ్వు ఆడిందే ఆట..పాడిందే
పాటనా.నువ్వు జీతం పెంచుకున్నప్పుడు మా ఆర్టీసి కార్మికులకు ఎందుకు పెంచవ్ ?

తెలంగాణ రాష్ట్రం ఏర్పిడిన
మరు క్షణమే సియం. హోదాలో
మన తెలంగాణ రాష్ట్రంలో
ఇంకా 1400 గ్రామాలకు బస్సు
సౌకర్యం లేదు. ఆ 1400
గ్రామాలకు బస్రు సౌకర్యం
కల్పించడమే నా ధ్యేయం
అన్నావు.ఆ మాట ఎక్కడికి
పోయింది.గంటకో మాట
మాట్లాడుతవా!

కార్మికులు సమ్మెకు దిగితే…
2200 అద్దె బస్సులకు తోడు
మరిన్ని ఇతర రాష్ట్రాల నుండి
తెప్పించడంతో పాటు,ప్రైవేట్
డ్రైవర్లతో పాటు,పదవీ
విరమణ పొందిన డ్రైవర్ల
సేవలు వినియోగించుకోవాలని
అంటున్నవ్ .ఆర్టీసీలో చేసి
పదవీ విరమణ చేసిన వారి
జీవితాలు ఇప్పటికే సర్వనాశం
అయ్యాయి.వాళ్ళెల్లా వస్తారు.
ఇక ప్రైవేట్ డ్రైవర్లు ఎలా
వస్తారు.ఆర్టీసీలో ఉద్యోగం
వస్తదని ఎదురు చూస్తున్నారు.ఖాళీలను ఇప్పటి వరకు భర్తీ
చేయలేదు.ఆర్టీసీలో ఇప్పటి
వరకు ఒక్క పోస్టంటే ఒక్క
పోస్ట్ వేయలేదు.

ఆర్టీసీలో కార్మికులు సమ్మె చేస్తే
తక్షణమే కార్మికులను
తొలగిస్తాం..ఆర్టీసీ చరిత్రలో
ఇదే చివరి సమ్మెగా మిగిలి
పోతుంది అని హెచ్చరిస్తున్నావ్ అంటే..మాకు కూడా
బర్లు,గొర్లు కొనిస్తవా?

నీ దగ్గర దేశంలో ఎవరి దగ్గర
లేని తెలివి తేటలున్నవి.
ఎదుటి వారిని మాటలతో
బుట్టలో పడే సామర్ధ్యం ఉంది.
నువ్వు మాట్లాడే మాటలు
మాకు వాస్తవాలు అనిపించే
విధంగా మాట్లాడగల్గుతారు.

ఇప్పుడు మీ కన్ను రాష్ట్రాన్ని
వదిలి దేశం మీద పడ్డది.
ప్రధానమంత్రి కావాలని ఆశ
పడుతున్నారు.ప్రధానమంత్రి
ఐతే కాండి…కానీ మా ఆర్టీసీని,
కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో
కల్పి ప్రధానమంత్రి కండి..

మీ నిర్ణయం కోసం ఎదురు
చూసే…

మీ తెలంగాణ 53 వేల ఆర్టీసీ
కార్మికులు…

(వాట్సాప్ లో వైరల్ అవుతుంది)