మునిగిపోతున్న పడవ కేసీఆర్. -ఎంపీ జేసీ వ్యాఖ్యలు!!

విజయవాడ:

ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతున్న భాషతో కేసీఆర్ తన నెత్తిన తానే చేయి పెట్టుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ భాష మార్చుకోవాలని, దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎలా మాట్లాడుతారో చూడాలని సూచించారు. చంద్రబాబుకు, కేసీఆర్‌కు చాలా తేడా ఉందని అన్నారు. మోదీ ఓ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని తానెప్పుడో చెప్పానని వ్యాఖ్యానించారు.