మునుగోడులో ఆరని అసమ్మతి చిచ్చు.

నల్లగొండ:
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికారపక్షంలో అసమ్మతి చల్లారడం లేదు. పార్టీ అసమ్మతి నాయకుడు వెంకటేశ్వరరావును బహిష్కరించిన తర్వాత అసమ్మతి మరింత భగ్గుమంటున్నది. మునుగోడు మండల కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిల దిష్టిబొమ్మను టీఆర్ఎస్ అసమ్మతి నాయకులు గురువారం దగ్ధం చేశారు.