మునుగోడు అభ్యర్థి మార్పు జరిగే వరకు పోరు ఆగదు.

రవి,నల్లగొండ:
మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు పార్టీ వ్యవస్థాపక సభ్యులు భీమిడీ యాదిరెడ్డి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. 2001 నుంచి పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా పని చేసామని 2007లో పార్టీలో చేరిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సీనియర్లను పక్కకు పెట్టి భజన బృందం వెంటేసుకుని తిరుగుతున్నాడని అన్నారు.ఆయనవల్ల మునుగోడు నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా సర్వ నాశనమైందని అన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి ధైర్యం ఉంటే ఇండిపెండెంట్ గా తన మీద పోటీ చేసి ఐదు ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నా… రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని సవాలు విసిరారు. అభ్యర్థిని మార్చకపోతే ఓడిస్తామని ప్రకటించారు. అభ్యర్థి మార్చే వరకు ఉద్యమం తప్పదని రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉంటుందని ప్రకటించారు.