మునుగోడు లో నూతన తార

నల్లగొండ:

1994 నుంచి సామాజిక కళాకారునిగా చదువు వెలుగు కార్యక్రమంలో తన కళా రూపాలతో నల్లగొండ జిల్లాలో అక్షరాస్యత ఉద్యమంలో ఉప్పు కృష్ణ క్రియాశీల పాత్ర పోషించారు. 1998 నుంచి ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమ నాయకునిగా 2008 వరకు అనేక పోరాటాలలో చౌటుప్పల్ నుంచి భువనగిరి వరకు జరిగిన అనేక ఉద్యమాలలో పాల్గొన్న నాయకుడు. సాధారణ కార్యకర్త నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుల వరకు విద్యార్థి యువజన ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసినటువంటి వ్యక్తి. 2009 కేసీఆర్ ఆమరణ దీక్షకు మద్దతుగా చౌటుప్పల్లో విద్యార్థి జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ వాదాన్ని బలోపేతం చేయడంతోపాటు అనేక మంది సామాజిక బహుజన తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడు ఉప్పు కృష్ణ. 2009 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కేసులకు తిరుగుతూ పోలీసుల వేధింపులు తట్టుకొని కూడా తెలంగాణ వైపు నిలబడి అటువంటి వ్యక్తి. రౌడీ షీట్ లు నమోదు చేసిన, కేసులు పెట్టినా, ఎలాంటి భయాలకు తప్పకుండా తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ప్రజా ఉద్యమాలలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తిగా, విద్యార్థి ఉద్యమ నాయకునిగా ఉప్పు కృష్ణ సుపరిచితుడు. ఈ ప్రాంతంలోని అనేక సమస్యల మీద అవగాహన ఉన్న నాయకుడు ఉప్పు కృష్ణ ను మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని పలువురు వ్యక్తులు, సంస్థలు, ప్రగతి శీల వర్గాలు కోరుతున్నారు.