ముళ్ల పొదల్లో మగ శిశువు మృతదేహం

వనపర్తి:
కన్న పేగు బంధాన్ని తెంచుకుని భూమి మీద అడుగు పెట్టిన కొద్ది సేపటికే మగ శిశువు డ్రైనేజీ దగ్గర ముళ్ల పొదల్లో విగతజీవిగా మారిన విషాద ఘటన వనపర్తి పట్టణంలోని శ్వేతానగర్ లో చోటు చేసుకుంది. ముళ్ల పొదల్లో మగ శిశువు మృతదేహం లభించిందనే సమాచారం పట్టణమంతా వ్యాపించిండంతో అక్కడికి చేరుకున్న స్థానికులు శిశువు మృతదేహన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ, మున్సిపాలిటీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.