మూకదాడులు ప్రపంచమంతా ఉన్నవే. సి.ఎం.వసుంధరరాజే.

జైపూర్:
మూక దాడులు రాజస్తాన్‌కే పరిమితం కాదని, ప్రపంచమంతటా ఈ ధోరణి ఉందని రాజస్తాన్‌ సీఎం వసుంధరా రాజె పేర్కొన్నారు. ఈనెల 20న అల్వార్‌లో గోరక్షకులుగా చెప్పుకునే ‘మూక దాడి’లో రక్బర్‌ ఖాన్‌ మరణించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ఇలాంటి ఘటనలు రాజస్తాన్‌లోనే కాదు ప్రపంచమంతటా జరుగుతున్నవే. రాజస్తాన్‌లో మాత్రమే జరుగుతున్నవి కాద’ని ఓ న్యూస్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు. రక్బర్‌ ఖాన్‌ హత్యోదంతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించడం ద్వారా కఠినంగా వ్యవహరించామన్నారు.