మేక ను కూడా విడిచి పెట్టని కామాంధులు. అసహజ లైంగిక చర్య. 8 మందిపై కేసు నమోదు.

న్యూఢిల్లీ:
కామాతురాణాం న భయం న ‘లజ్జా’ అంటారు. సిగ్గూ ఎగ్గూ లేని కాముకులు తల్లీపిల్లల్నే కాదు… జంతువులతో అసహజ శృంగారానికి కూడా వెనుకాడరు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఓ మేకపై ఎనిమిది మంది కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. అసహజ శృంగారానికి ఒడిగట్టారు. దీంతో ‘మీ కంటే నోరులేని మా జంతువులే మేలు’ అనుకుందో, మీ ముఖం చూడటం కూడా పాపం అనుకుందో, ఇంకా నా పిల్లల్ని కూడా ఈలోకంలోకి తెచ్చి మీలాంటి కామాంధులకు విడిచిపెట్టడం ఎందుకనుకుందో ఏమో కానీ ఆ మేక తన ప్రాణాలను కూడా వదిలేసింది. మనుషులే కాదు… జంతువులు కూడా అసహస్యించుకునే ఈ దుశ్చర్య హర్యానాలోని మేవట్‌లో చేటుచేసుకుంది. మేక యజమాని అస్లు తన పెంపుడు జంతువుపై జరిగిన సామూహిక అత్యాచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సవకర్, హరూన్, జఫర్, మరో ఐదుగురు కలిసి ఈ జంతుహింస, అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఐదుగురిని గుర్తించాల్సి ఉండగా, మొత్తం ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన నిందితులు మేక ఒంటరిగా ఉండగా ఇంట్లోకి చొరబడి దానిని లైంగిక దుశ్చర్యలతో హింసించి తమ పాశవిక కోర్కె తీర్చుకున్నారు. కాగా, మేకపై జరిగిన లైంగిక దాడిని నిర్దారించేందుకు మెడికల్ రిపోర్ట్ కోసం చూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గర్భిణి అయిన మేకతో అసహజ లైంగిక చర్యకు పాల్పడి దాని మరణానికి కారణమైన ఘటనపై జంతు హక్కుల సంస్థ ‘పెటా’ తీవ్రంగా స్పందించింది. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులతో సహకరిస్తామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొంది. జంతువులపై లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు, జరిమానాలు విధించేలా ప్రభుత్వాన్ని కోరేందుకు ప్రతి ఒక్కరూ ‘పెటా’తో కలిసి రావాలని కోరింది.