మేజిస్ట్రేట్ పై లైంగిక కేసు నమోదు!

నల్లగొండ:
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ టి. సత్యనారాయణపై చిక్కడపల్లి పోలీసులకు రజని అనే మహిళ ఫిర్యాదు చేశారు. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేశాడని పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మెజిస్ట్రేట్ పై అట్రాసిటీ, రేప్ తో పాటు పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.