మైనర్‌ను గర్భవతిని చేసిన నీచుడు. గర్భానికి వెలకట్టిన పెద్దలు.

మహబూబ్ నగర్:
మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో ఓ బాలికను గర్భవతిని చేశాడో కామాంధుడు. దీనికి ఆ కాలనీ పెద్దలు వెలకట్టి గప్‌చుప్‌ చేయాలని చూశారు. పేటకు చెంది న బాలికను పత్తిపొలం యజమాని గర్భవతిని చేశాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ప్రశ్నించగా బాలిక ఆ పత్తిపొలం యజమాని పేరు చెప్పింది. తల్లిదం డ్రులు తెలిపిన వివరాల మేరకు బాలిక ప్రతి రోజు పత్తి పొలంలో పని చేసేందుకు వెళ్తోంది. ఆ యజమాని అమ్మాయిని లైంగిక దాడి చేయడంతో గర్భం దాల్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆ కాలనీ పెద్దలకు తమ గోడును వెల్లబోసుకోగా వారు అతడిని పిలిపించి పంచాయితీ నిర్వహించారు. బాలిక దాల్చిన గర్భానికి రూ.2.10 లక్షలు వెలకట్టారని సమాచారం. ఆ కామాంధుడు ఈ అమ్మాయినే కాకుండా ఎంతోమందిని ఇలాగే మోసం చేశా డనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వారిపై పోలీ సులకు ఫిర్యాదుచేసి కటకాల వెనక్కు పంపిస్తేనే సరైన శిక్ష ఉంటుందని పట్టణప్రజలు అంటున్నారు. పోలీసులు స్పందించి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని పట్టణ వాసులు బాలిక తల్లి తండ్రులు కోరుతున్నారు.