మైనారిటీల వ్యతిరేకి టిఆర్ఎస్ కు ప్రచారకర్తగా అసదుద్దీన్.-టీపీసీసీ చీఫ్ ఉత్తమ్.

హైదరాబాద్:

మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి టీఆరెస్ ప్రచారకర్త గా మారినట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కొద్దీ రోజులుగా అసద్ టీఆరెస్ పార్టీ కి మద్దతుగా మాట్లాడుతున్నాడని అన్నారు.

టీఆరెస్ పార్టీ అనేక విషయాల్లో కేంద్రంలో బీజేపీ కి మద్దతు ఇస్తున్నందుకు గాను MIM టీఆరెస్ కు మద్దతు ఇస్తున్నదా? అని ప్రశ్నించారు.
ముస్లిమ్స్ కు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వనందుకు గాను MIM టీఆరెస్ కు మద్దతు ఇస్తుందా అని ప్రశ్నించారు.ప్రతి విషయంలో ముస్లిమ్స్ ను మోసం చేసినందుకు ,వక్ఫ్ బోర్డ్ ఆస్తులను కాపాడనందుకు ,ముస్లిమ్స్ విద్య సంస్థలు మూసివేసునందుకు,ఆలేరు ఎంకౌంటర్లో 5మంది ముస్లిమ్ లను ఎంకౌంటర్ చేసినందుకు కేసీఆర్ కు మజ్లీస్ మద్దతు ఇస్తున్నదా? అని టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. టీఆరెస్ కు ఓటు వేయమని అసద్ ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నారో జవాబు ఇవ్వాలని ఉత్తమ్ కోరారు.నాలుగు సంవత్సరాలలో ఒక్క ఉర్దూ ఉపాధ్యాయుడు కూడా నియమింప్పబడలేదన్నారు.పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తానన్న కేసీఆర్ హామీని మజ్లీస్ ఎలా మరచిపోయిందని విమర్శించారు.

పాత నగరంలో ఇప్పటివరకు మెట్రో స్టార్ట్ కాలేదని తెలిపారు.’ఇస్లామిక్ సెంటర్’ కోసం ఇప్పటివరకు పునాదిరాయి కూడా వేయలేదని విమర్శించారు.”నీ పై ,నీ తమ్ముడిపై ఉన్న కేసులు ఎత్తివేయాలనే షరతుల మేరకు కేసీఆర్ కు ఓటు వేయమని చెబుతున్నారా.మీరూ పైరవీ చేస్తున్న 40 కోట్ల భూమి కోసమా?మీ స్వప్రయోజనాల ముస్లిమ్స్ ను తప్పుదారి పట్టించి టీఆరెస్ కు ఓటు వేయమని చెబుతున్నారా?ఢీల్లీలో మోడీని ఓడించాలి అంటే ఇక్కడా చోట మోడీ ని ఓడించాలి.కేసీఆర్ కు ఓటు వేస్తే మోడీకి వేసినట్టే.తెలంగాణ మొత్తం నాలుగు సంవత్సరాల బడ్జెట్లో ముస్లిమ్స్ కు కేవలం 0.4 శాతం మాత్రమే నిధులు కేటాయించారు.

ఇంతకు ముందు ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని నిలబెట్టని మాట వాస్తవం, ఈ ఎన్నికలలోబలమైన అభ్యర్థిని నిలబెడతాం.
ఈ ఎన్నికలలో MIM పై పోటీని చాలా సీరియస్ గా తీసుకుంటాం.ముస్లిం సోదరులు ఇవ్వన్నీ గమనించి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి.వచ్చే పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ తో కలిసి కేసీఆర్ ఎన్నికలకు వెళ్తున్నాడు” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు..